మళ్ళీ రీమేక్ సినిమా చేయబోతున్న సమంత

252
Samantha's once again film with Nandini Reddy new Remake film
Samantha's once again film with Nandini Reddy new Remake film

గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గత కొంతకాలంగా రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సమంత హీరోయిన్ గా వచ్చిన ‘యూటర్న్’ సినిమా కన్నడ సినిమా రీమేక్. ఇక ఈ మధ్య విడుదలైన ‘ఓ బేబీ’ కూడా సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రానీ’ రీమేక్. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ‘ఓ బేబీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన నందినిరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా ఒక రీమేక్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా రీమేక్ అని క్రైమ్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఫుల్ గా నవ్విస్తుందని సమాచారం. అన్ని ఓకే అయితే సురేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు అని తెలుస్తోంది.

Loading...