Saturday, April 27, 2024
- Advertisement -

అధీరా గా సంజయ్ దత్: లుక్ అదిరింది

- Advertisement -

కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ‘కే జి ఎఫ్’ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘కేజీఎఫ్ 2’. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. తాజాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆ చిత్ర బృందం సినిమా నుంచి సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

సంజయ్ దత్ ఈ సినిమాలో ‘అధీర’ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంజయ్ దత్ పవర్ఫుల్ గా గంభీరంగా కనిపిస్తున్నారు. సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హోంబల్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బసృర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -