Saturday, April 27, 2024
- Advertisement -

టీజర్ రివ్యూ : ఇంట్రో తో రచ్చ లేపుతున్న మహేష్

- Advertisement -

తన కెరియర్ లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ సినిమాని ‘ఎఫ్2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈసినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతోంది. విజయశాంతి, ఆది పినిశెట్టి, సంగీత, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆర్మీ మేజర్ అవతారంలో మహేష్ బాబు ఈ టీజర్ లో చాలా కొత్తగా మరియు స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మహేష్ బాబు లుక్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దిల్ రాజు మరియు రామబ్రహ్మం సుంకర కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -