Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాస‌న్‌..

- Advertisement -

సవ్యంగా సాగుతుందనుకొన్న శృతి అండ్ మైఖేల్ వ్యవహారం కాస్త, చేజారిపోయింది. ఐరన్ లెగ్ అని పేరుగాంచిన శృతి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో గోల్డెన్ లెగ్ గా ఫేమస్ ఐన సంగతి మనందరికీ తెలిసిందే. లండ‌న్‌కు చెందిన సింగ‌ర్ మైఖేల్ తో ప్రేమలో పడింది. ఆ తరువాత అమ్మడు సినిమాల జోరు తగ్గిస్తూవచ్చింది.దీంతో ఏడాది కాలంగా వెండి తెర‌మీద క‌నిపించ‌లేదు. ఆ ప్రేమ వ్యవహారం కాస్త బెడిసి కొట్టడంతో, మరల సినిమాలపై తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ క్రమంలో రెండు సినిమాలలో నటించే అవకాశం వుందని వార్తలొస్తున్నాయి.

తెర‌మీద క‌నిపించ‌క‌పోయినా రూమ‌ర్స్‌తో సోష‌ల్ మీడియాలో ఆడియెన్స్ దృష్టిలో పడుతూనే ఉంది. బాయ్ ఫ్రెండ్ మైకేల్‌ కోర్సేల్‌ తో బ్రేకప్ విషయం సౌత్ లో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అమ్మానాన్నలకు పరిచయ చేసిన బేబీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అనుకున్న సమయంలో సడన్ గా బ్రేకప్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేసింది.

బ్రేకప్ చెప్పేసినప్పటికీ శ్రుతిని వ‌ద‌ల‌డంలేదు ఆమె ఫ్యాన్స్‌. ఆమె ఫాలోవర్స్ అయితే గుచ్చి గుచ్చి అడిగేస్తున్నారు. రీసెంట్ ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ రూమ‌ర్స్‌కి చెక్ పెట్టింది శ్రుతి. మీ పెళ్లెప్పుడో చెబితే మేమంతా వస్తామని ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. నా పెళ్లి ఇప్పుడే కాదు ఇంకా చాలా సమయం ఉంది. వెయిట్ చేయాల్సిందే. అయితే బర్త్ డే కి మీరంతా రావచ్చని అభిమానులను నిరాశపరచకుండా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -