Saturday, April 27, 2024
- Advertisement -

రాజ‌మౌలి, మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ…

- Advertisement -

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీఅంచ‌నాల‌తో రూపొందిన ‘మహర్షి’ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మహర్షి రిలీజ్ హంగామాలో ఉన్న మహేష్ తన తర్వాత సినిమా అనీల్ రావిపుడి సినిమాతో ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. ఇక మహర్షి ప్రమోషన్స్ లో రాజమౌళి డైరక్షన్ లో సినిమా గురించి స్పందించాడు మహేష్.

సూపర్ స్టార్ మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేదాకా వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ‌, ప్ర‌భాస్ వంటి స్టార్స్ తో రాజమౌళి సినిమా తీయగా మహేష్ తో మాత్రం తీయలేదు. దీనికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నా సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

ఇక మహర్షి ప్రమోషన్స్ లో రాజమౌళి డైరక్షన్ లో సినిమా గురించి స్పందించిన‌ మహేష్. రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నా అది వెనక్కి పోతుందని త్వరలోనే ఆ సినిమాపై ఓ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అన్నారు సూపర్ స్టార్ మహేష్.బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ కథతో చేస్తున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమా తర్వాత మ్యాక్సిమం మహేష్ తోనే సినిమా ఉండే అవకాశం ఉందట.

మహేష్ సినిమా కోసం కె.ఎల్ నారాయణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు జక్కన్న. అయితే మహేష్ మాటలని బట్టి చూస్తుంటే ఈసారి రాజమౌళితో తన సినిమా పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ తో రాజమౌళి సినిమా అంటే ఇక ఆ సినిమా సృష్టించే ప్రభంజనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -