Friday, April 26, 2024
- Advertisement -

డీ-డ‌బ్స్ హైద‌రాబాద్‌లో ప్రారంభం

- Advertisement -

ఒక్క దాని మీద న‌మ్ముకొని ఉంటే ఏం ప్ర‌యోజ‌నం లేద‌ని సినీన‌టుల‌కు బాగా తెలుసు. అందుకే తాము సినీ ప్ర‌యాణం చేసుకుంటూనే మిగ‌తా ప‌నుల‌పై కూడా దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు అంద‌రూ సినీన‌టులు వ్యాపార రంగంలోకి దిగుతున్నారు.

సినిమాలు లేన‌ప్పుడు వ్యాపారాలు అయిన చూసుకుందామ‌ని, లేదా కాల‌క్షేపం కోస‌మైనా వ్యాపార రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఈ విధంగా వ్యాపార రంగంలోకి చాలా మంది ప్ర‌వేశించారు. ఆ విధంగా వ్యాపారంలోకి దిగా లాభ ప‌ట్టిన న‌టులు ఎంత‌మందో ఉన్నారు. సినిమా రంగం నుంచి వ‌చ్చిన డ‌బ్బును వ్యాపారాల కోసం వినియోగిస్తున్నారు. డ‌బ్బును తిరిగి డ‌బ్బు వ‌చ్చేలా అర్థ‌శాస్ర్త సూత్రాన్ని బాగా ఒంట ప‌ట్టించుకున్నారు. దాని అమ‌లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఆ విధంగా అల్లు అర్జున్ ఓ అంత‌ర్జాతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్ప‌టికే 800 జూబ్లీ ప‌బ్ ఎలాగో అత‌డికి ఉంది. క‌నోలి కేఫ్స్ అంటూ ఓ బేక‌రిని ప్రారంభించిన అత‌డు ఇప్పుడు హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త వ్యాపారం మొద‌లు పెట్టాడు. ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌ముఖ స్పోర్ట్స్ బార్ డి-డ‌బ్స్ బ్రాంచ్‌ను ఈ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 17)న హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఆ కంపెనీలో పార్ట‌న‌రే కాకుండా పెట్టుబ‌డి కూడా పెట్టాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే సినిమాలో న‌టిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -