Friday, April 26, 2024
- Advertisement -

స‌న్నీలియోన్‌ జీవిచ‌రిత్ర‌పై బ‌యోపిక్‌

- Advertisement -

పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగి బిగ్‌బాస్‌ షో పాపులారిటీతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌రైంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో అడుగుపెట్టి వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్ర‌త్యేక అతిథి పాత్ర‌ల్లో.. ప్ర‌త్యేక పాట‌ల్లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇప్పుడు సన్నీలియోన్ జీవిత చరిత్ర‌పై సినిమా రూపొందిస్తున్నారు.

ఆమె జీవిత‌చ‌రిత్ర‌పై సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స‌న్నీలియోన్ అసలు పేరు ‘కరణ్‌జీత్‌’ పేరుతోనే ఈ వెబ్‌సిరీస్‌ను జీ5 వెబ్ ఫ్లాట్‌ఫాం రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సన్నీలియోన్ ట్విటర్‌లో ప్ర‌క‌టించింది.

‘నేను కెనడా నుంచి ఎందుకు తిరిగొచ్చాను? సన్నీ లియోన్‌గా పేరు ఎందుకు మార్చుకున్నాను? కరణ్‌జీత్‌ నుంచి సన్నీగా మారే క్రమంలో నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వెబ్‌ సిరీస్‌లో తెలుసుకోవచ్చని’ సన్నీ తెలిపింది. అయితే సన్నీ పాత్రలో తనే నటిస్తుందా లేదా అనే విషయం ఇంకా తెలియ‌రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -