Friday, April 26, 2024
- Advertisement -

వకీల్ సాబ్.. ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్‌కి ఓకే.. కానీ ?

- Advertisement -

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అప్పుడే రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ మొదలు పెట్టాడు. అందులో ఒకటి పింక్ రీమేక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరీవెగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా యూనిట్ సభ్యులు అధికారికంగా ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అంటూ టైటిల్ ను ఖరారు చేయడంతో పాటు పవన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు.

ఈ టైటిల్ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. టైటిల్ విషయంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. కాని పవన్ లుక్ కు మిశ్రమ స్పందన వస్తుంది. పవన్ అభిమానులు మాత్రం ఫస్ట్ లుక్ అదిరింది అంటున్నారు. నిజానికి పింక్ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. కానీ వకీల్ సాబ్ మత్రం కమర్శియల్ సినిమా లుక్ లో కనిపిస్తున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్ లో వచ్చి ఫస్ట్ లుక్స్ తో పొలిస్తే వకీల్ సాబ్ లుక్ కమర్శియల్ గా ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ కమర్శియల్ హీరో కాబట్టి ఫస్ట్ లుక్ ఇలా డిజైన్ చేశారేమో. ఇక దాదాపుగా రెండు ఏళ్ల తర్వాత పవన్ చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మిగితావారు ఫస్ట్ లుక్ లోనే కమర్శియల్ లాగా చూపిస్తే సినిమాలో ఎంకెన్ని కమర్శియల్ సీన్స్ ఉన్నాయో అని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పింక్ కేవలం ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రమే. అందులో కమర్శియల్ ఎలిమెంట్స్ ఉండవు. మరి పవన్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -