Friday, April 26, 2024
- Advertisement -

వాల్మీకి ట్రైలర్ రివ్యూ : మెగాస్టార్ నటవారసుడు విలన్ అవతారం ఎత్తితే

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు ఎంత గొప్పదో మనందరికీ తెలుసు, ఆయన రేంజ్ ఏంటో కూడా మనకి తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమకు 3 తరాలకు సరిపడా హీరోలను సప్లై చేసిన చరిత్ర వాళ్ళది. మెగాస్టార్ అభిమానుల పుణ్యమా అని ఆ ఇంట్లో నుండి ఏ హీరో వచ్చినా వెనక్కి తిరిగి చూసుకొవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది వాళ్ళ కెరీర్. కాకపోతే మెగా అభిమానులు కానివారికి మాత్రం ఇదంతా కొంచెం చిరాకుగానే ఉంటుంది. అలాంటి అభిప్రాయాలను తుడిచెయ్యడానికే వారు కూడా కష్టపడుతూ వారి పేరును వారే నిలబెట్టుకున్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన అద్భుతమైన సినిమాలే సాయి తేజ్ చిత్రలహరి, రామ్ చరణ్ మగధీర, రంగస్థలం.

ఈ కుటుంబంలో నుండి వచ్చి చాలా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ అంటే మెగా అభిమానులు కానివారికి కూడా చాలా ప్రేమ. అందుకే తను ఏ సినిమా చేసినా చాలా బాగా వెల్ కమ్ చేస్తారు. వరుణ్ ఎంత సైలెంటో తన పాత్రలు కూడా అంటే చాలా నీట్ గా, సైలెంట్ గా ఉంటాయి. కానీ తను రఫ్ఫాడిస్తే, గూండా అయిపోతే ఏలా ఉంటుందో చూడాలి అంటే మాత్రం వాల్మీకి కోసం వైట్ చెయ్యాల్సిందే. వాల్మీకి లో వరుణ్ తేజ్ ను చూస్తుంటే మెగా కుటుంబంలో చిరంజీవి తర్వాత గొప్పస్థాయికి వెళ్ళే నటుడు అనిపిస్తుంది. వరుణ్ చెప్పే ఒక్కో డైలాగ్ ప్రేక్షకులను తన విలనిజానికి ఫ్యాన్ అయ్యేలా చేస్తుంది. తన న్యూ లుక్ లో చాలా హాట్ గా కనపడుతున్నాడు వరుణ్. వాల్మీకి ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరి మన్ననలు పొందుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -