Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమా ఆలస్యం కానుంది

- Advertisement -

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యనే రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మర్చిపోలేని హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ తో యువ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్.

మరోవైపు ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘హీరో’ అనే సినిమా తో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతుందట.

ప్రస్తుతం షూటింగ్ లోని ఆఖరి షెడ్యూల్ జరుగుతోందని, ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది మొదలు కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వచ్చే ఏడాది సినిమా స్టార్ట్ కానుంది. ఈ అనుకోని ఆలస్యానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ మరియు పూరి జగన్నాథ్ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు కానుంది. అయితే ‘హీరో’ సినిమా షూటింగ్ అక్టోబర్లో పూర్తవుతుందట. నవంబర్ మొత్తం ఈ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ డిసెంబర్లో పూరి సినిమాలో తన పాత్రకి కావలసిన ఫిజిక్ కోసం ప్రయత్నించనున్నాడు. ఈ సినిమా కూడా ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -