Friday, April 26, 2024
- Advertisement -

మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌లో వెంకీ?

- Advertisement -

టాలీవుడ్‌లో మల్టీస్టార‌ర్ మూవీస్ ట్రెండ్ న‌డుస్తుంది. వ‌ర‌స పెట్టి మల్టీస్టార‌ర్ మూవీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు తెలుగు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు.విశేషం ఏమిటంటే ఈ మ‌ల్టీస్టారర్ మూవీస్‌లో అన్నింటిలోను సీనియర్ హీరో వెంక‌టేష్ భాగ‌స్వామ్యం ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ‘F2’.. నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ అనే రెండు మల్టిస్టారర్లలో నటిస్తున్నాడు వెంకీ. తాజాగా ఆయ‌న మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది.

ఈసారి టాలీవుడ్ హీరోతో కాకుండా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి నటిస్తాడట వెంకీ. ఈ సినిమా స్టొరీ యద్ధనేపథ్యంలో సాగుతుందట. భారీ బడ్జెట్ వార్ డ్రామా అని – ఈ సినిమాకు ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తారని సమాచారం. ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ మ‌హ‌న‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు చాలా దగ్గ‌ర అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -