Friday, April 26, 2024
- Advertisement -

భర్త ఎఫర్ట్ కి అర్థం లేకుండా చేసిన వితిక

- Advertisement -

వితిక మరియు వరుణ్ సందేశ్ ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో స్ట్రాంగ్ గా ఆట ఆడుతున్న సభ్యులు. మొదటి నుంచి వీరు ఇరువురు చివరి వరకు వస్తారు అనే నమ్మకం అందరిలో ఉంది. అయితే ఈ ఇద్దరు మధ్య మధ్య లో చిన్న గొడవలు పెట్టుకున్నా కానీ చివరికి మాత్రం ఒకటై పోయి కలిసి మెలిసి ఆడుతున్నారు.

సోమవారం మరియు మంగళవారం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ప్రక్రియ లో భాగం గా వరుణ్ సందేశ్ హిమజ కోసం త్యాగం చేసాడు. హిమజ కోసం వరుణ్ పేడ లో పడుకున్నాడు. అయితే వితిక కి ఇది నచ్చలేదు. హిమజ కూడా వరుణ్ ని వద్దు అని వారించింది కానీ వరుణ్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా టాస్క్ ని కంప్లీట్ చేసాడు. చివరికి హిమజ సేఫ్ అని బిగ్ బాస్ ప్రకటించారు.

అయితే ఆ తర్వాత ఇంటి కెప్టెన్ అయిన వితిక ఒకళ్ళని డైరెక్ట్ గా నామినేట్ చేయాలి అని చెప్పినప్పుడు హిమజ పేరు చెప్పి హిమజ ని నామినేట్ చేసింది.దీని వలన వరుణ్ చేసిన ఎఫర్ట్ అంతా వృథా అయినట్టే అనుకోవాలి. ఒకవేళ హిమజ ని సేవ్ చేసి ఉంటె పరిస్థితి వేరే లాగ ఉండేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -