Saturday, April 27, 2024
- Advertisement -

యువరాజ్ సింగ్ తండ్రి తో రజినీకాంత్ పోరాటాలు

- Advertisement -

స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా క్రికెటర్ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే యోగరాజ్ సింగ్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఆయన అనేక పంజాబీ సినిమాల్లో నటించి ఎంతో మందిని మెప్పించారు. అంతే కాకుండా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన భాగ్ మిల్కా భాగ్ అనే సినిమా లో కూడా ఒక స్పెషల్ రోల్ లో నటించారు.

ఇప్పుడు తాజా గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈయన దక్షిణ భారత సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అన్నీ అనుకున్న విధం గా జరిగితే యోగరాజ్ తమిళం లో త్వరలో రానున్న దర్బార్ అనే సినిమా లో కనిపించే అవకాశం ఉంది. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం లో రజినీకాంత్ ప్రధాన పాత్ర లో రానున్న ఈ సినిమా లో యోగరాజ్ ఒక విలన్ పాత్ర ని చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రతీక్ బబ్బర్ ముఖ్య విలన్ పాత్ర ని పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -