Friday, April 26, 2024
- Advertisement -

వ్యాపారవేత్తకు భార్య వల.. భర్తతో అలా..!

- Advertisement -

ఎయిర్ హోస్టెస్ గా పని చేసే కనిష్క కు హైదరబాద్ కు చెందిన ఓ బిజినేస్ మాన్ తో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడు నెలలు కలిసి తిరిగారు. ఇలా కనిష్కతో ఆ వ్యాపరవేత్త సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమె భర్త పోటోలు, వీడియోలు తీశాడు. భార్య భర్త కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. నెల క్రితం శంషాబాద్ దగ్గర్లో ఉన్న రిసార్ట్ కు వ్యాపారవేత్తతో కలిసి కనిష్క వెళ్లింది.

అక్కడ అతనికి మత్తు మందు ఇచ్చి.. ఆ తర్వాత భార్య భర్త కలిసి సీక్రెట్ గా ఓ సీన్ క్రియేట్ చేశారు. కనిష్కను భర్త విజయ్ కుమార్ బాగా కొట్టినట్లు.. ఆమె ఒంటిపై స్వల్పగాయాలయ్యేట్లు చేసి.. ఆ గదిని కూడా చిందర వందరగా మార్చేశారు. మత్తు నుంచి బయటకు వచ్చిన వ్యాపారిని కనిష్క భర్త విజయ్ కుమార్ బెదిరించాడు. నా భార్యతో సరసమాడతావా ? అంటూ అతనిపైకి దూసుకెళ్లాడు. వ్యాపారి కణతకు గన్ పెట్టి చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన వ్యాపారి అక్కడికి అక్కడే 20 లక్షలు క్యాష్ తెప్పించి వాళ్లకు ఇచ్చాడు.

అంతేకాకుండా ఇంకో కోటి వరకు బాండ్ కూడా రాసిచ్చాడు. ఇక అక్కడితో అది మర్చిపోయాడు ఆ వ్యాపారవేత్త. అయితే మళ్లీ డబ్బుల కోసం విజయ్ కుమార్ నుంచి బెదిరింపు రావడంతో శంషాబాద్ డివిజన్ పోలీసులకు ఆ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పీలుసులు హనీ ట్రాప్ కు పాల్పడిన భార్య భర్తలిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వలలో ఇంకా చాలా మంది పడి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -