విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ.. వీరిలో ష‌మీ ఓటు ఎవ‌రికంటే ?

708
indian Pacer Mohammed Shami Chooses Rohit Sharma Over Virat Kohli
indian Pacer Mohammed Shami Chooses Rohit Sharma Over Virat Kohli

భార‌త క్రికెట్ జ‌ట్టుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ మూల‌స్తంభ‌ల్లాంటివారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ కెప్టెన్ గా బాధ్యత వహిస్తూనే పరుగుల వర్షం కురిపించగలడు. ఇక రోహిత్ ఓపెనర్ గా ఎలాంటి సంచనాలు సృష్టించాడో తెలిసిందే. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ల‌తో వీరిద్దరూ జ‌ట్టుకు విజ‌యాల‌ను అందించారు.

అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రికి సంబంధించి భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి చిక్కుప్ర‌శ్న ఎదురైంది. రోహిత్‌, కోహ్లీ ఇరువు‌రు ప‌ర‌స్ప‌రం వేర్వేరు జ‌ట్ల త‌ర‌పున ఆడితే, ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తావ‌ని ష‌మీని ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. అందుకు షమీ జవాబు ఇస్తూ.. కోహ్లీ ఆట‌తీరు గురించి తాను త‌క్కువ చేసి మాట్లాడనని.. మూడు ఫార్మాట్ల‌లో విరాట్ అనేక రికార్డులు న‌మోదు చేశాడ‌ని గుర్తు చేశాడు. అయితే రోహిత్ బ్యాటింగ్‌లో పొందిక ఉంటుంద‌ని కొనియాడాడు.

బౌల‌ర్‌ను ఎదుర్కొనేందుకు త‌న వ‌ద్ద చాలా స‌మ‌యం ఉంటుంద‌ని పేర్కొన్నాడు. బౌల‌ర్‌కు ఏమాత్రం అనుమానం రాకుండానే అత‌నిపై విరుచుకుప‌డే స్వ‌భావం హిట్‌మ్యాన్ సొంత‌మ‌ని.. అందుకే తన ఓటు రోహిత్ కే అని షమీ పేర్కొన్నాడు. ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అయితే ప్ర‌స్తుతం కోహ్లీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఉన్నాడు. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా క్రికెట్‌కు బ్రేక్ వ‌చ్చినా, ఫిట్‌నెస్ కోల్పోకుండా ష‌మీ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Loading...