బాలయ్యకు వరుణ్ తేజ్ కూడా పవరు ఫుల్ కౌంటర్ ఇచ్చాడా ?

560
Varun Tej Tweet shocks everyone
Varun Tej Tweet shocks everyone

తాజాగా ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఇది పెద్ద రచ్చ అయింది. లాక్ డౌన్ వల్ల మూతపడ్డ థియేటర్లు, నిలిచిపోయిన షూటింగ్ ల కోసం చిరంజీవి అలానే కొందరు సినీ పెద్దలు.. ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వాలంటూ మంత్రి తలసానికి రిక్వెస్ట్ పెట్టుకుంటూ మీటింగ్ లు కూడా కండక్ట్ చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ ను కలిసి తమ విషయం తెలియజేశారు.

అయితే ఈ మీటింగ్ లకు తనని పిలవలేదని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ’తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా ? నన్ను కనీసం పిలవాలని కూడా అనిపించలేదా’ అంటూ బాలయ్య కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇస్తూ.. మెగా బ్రదర్ నాగ బాబు వీడియోల మీద వీడియోలు చేసి యూట్యూబ్లో విడుదల చేసాడు. ‘నోరు అదుపులో పెట్టుకో బాలయ్య’ అంటూ గట్టి కౌంటర్ కూడా వేసాడు. నాగబాబు మాత్రమే కాదు ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా బాలయ్యకు పెద్ద కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది.

‘చేతిలో తుపాకీ ఉన్న వ్యక్తితో ఎవ్వరూ మాట్లాడరు’ అంటూ కామెంట్ చేసి ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో తను తుపాకీ పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసాడు వరుణ్. ఇప్పుడు వరుణ్ కామెంట్స్ ఇండైరెక్ట్ గా బాలయ్యకే కౌంటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ’గతంలో బాలయ్య ఓ అగ్ర నిర్మాతపై తుపాకితో దాడి చేశాడు’ అంటూ పెద్ద రచ్చే జరిగింది. పైగా బాలయ్యకు కోపం బాగా ఎక్కువ. ఎంతో మందిపై అనవసరంగా చెయ్యి చేసుకుంటాడు. అలాగే నోటికి వచ్చిన బూతులు తిడతాడు అని చాలా మంచి అంటూ ఉంటారు. మరి వరుణ్ తేజ్ ఇంటెన్షన్ ఇదే అయ్యి ఉంటుందా అని కామెంట్స్ వస్తున్నాయి.

Loading...