Saturday, April 27, 2024
- Advertisement -

మా పెళ్లికి అమ్మాయి వాళ్లు ఒప్పుకోలేదు : నిఖిల్

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్.. మొత్తానికి ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో నిఖిల్, పల్లవిల పెళ్లి ఘనంగా జరగబోతుంది. తాజాగా ఓ సందర్భంలో నిఖిల్ తన లవ్‌స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

తమ పెళ్లికి పల్లవి ఇంట్లో ముందు ఒప్పుకోలేదట. “ఐదు నెలల క్రితం నేను పల్లవిని ఓ పార్టీలో కలిశాను. తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె నెంబర్ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరం మంచి ప్రెండ్స్ అయ్యాం. పల్లవికి నేనంటే ఇష్టమని అర్దం అయింది. తను నాకు పర్‌ఫెక్ట్ అని ఎప్పుడో అర్థమైంది. కానీ నేనే క్లారిటీ వచ్చాక మా ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నా. అయితే పల్లవి ఇంట్లో వాళ్లు మాత్రం మా ప్రేమను అంగీకరించలేదు. అప్పుడు మా అమ్మే వారితో మాట్లాడి ఒప్పించింది. ఎంగేజ్మేంట్ అయ్యాక నేను పల్లవికి ఐఫోన్, చాకొలెట్ బాక్స్ కానుకగా ఇచ్చాను” అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ఇక నిఖిల్ సినిమాల విషయంకు వస్తే.. ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి హిట్ కొట్టాడు. పెళ్లి తర్వాత నిఖిల్ కొత్త సినిమా మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -