Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్ తో ఎఫైర్ పై స్పందించిన నమిత..!

- Advertisement -

ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు సినీ ఇండస్ట్రీలో ఏ రెంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి అనంతరం ప్రభాస్‌కి సంబంధించిన ప్రతి వార్త వైరల్ ఆవుతోంది. ఇక తాజాగా హాట్ బ్యూటీ నమిత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ప్రభాస్ పై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది.

ప్రభాస్ పై ప్రేమ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో నమిత, ప్రభాస్‌ల మధ్య డేటింగ్ నడిచినట్లు రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లినట్లు కూడా కొన్ని మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. నమిత, ప్రభాస్ కలిసి బిల్లా సినిమాలో నటించారు. 2009లో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఆ టైంలో ప్రభాస్, అనుష్కల మధ్య కూడా లవ్ నడిచినట్లు టాక్ వచ్చింది. ఇదే టైంలో నమిత పేరు కూడా వినిపించడం అందరిని షాక్ కి గురి చేసింది.

బిల్లా సినిమాలో నమిత, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీకి మంచి పాజిటివ్ మార్కులు పడ్డాయి. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ.. అప్పట్లో బిల్లా ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మా ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అందుకే మా మధ్య లవ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అలానే తనపై వచ్చిన మరో రూమర్ గురించి మాట్లాడుతూ సీనియర్ యాక్టర్ శరత్ బాబును తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని.. అయితే తండ్రి లాంటి వ్యక్తితో అలాంటి రూమర్స్ రావడం నిజంగా దారుణమని నమిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు నమిత చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -