Saturday, April 27, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు : షకీలా

- Advertisement -

షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు అడల్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మార్కెట్ లో అడల్ట్ సినిమాకు పెద్దగా గీరాకీ లేకపోవడంతో తన పంథా మార్చుకుని ‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’ సినిమాలో నటించింది షకీలా.

ఈ సినిమా టీజర్ లో ఏపీ మూడు రాజధానులపై పంచ్ లేసే ప్రయత్నం చేసింది. తన సినిమా ప్రచారం కోసమే ఇలా దిగజారుడు టీజర్లు వదుల్తోంది! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి టాలీవుడ్ స్టార్ హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను టార్గెట్ చేసి మాట్లాడింది.

ఓ ఇంటర్వూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా అడిగిన వాటికి వచ్చిన సమాధానాలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు నా తమ్ముడు లాంటోడు….బన్నీ ఎవరో నాకు తెలియదు! అంటూ వ్యాఖ్యానించింది. దీంతో సోషల్ మీడియాల్లో బన్ని ఫ్యాన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్నావు.. బన్నీ లాంటి స్టార్ హీరో ఎవరో తెలియదు అంటావా ? అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -