Friday, April 26, 2024
- Advertisement -

చిరు మూవీలో మహేష్ పాత్ర కావాలంటున్న బన్నీ ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో 40 నిమిషాల పాటు కనిపించే పవర్ ఫుల్ పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించాగా.. అందుకు మహేష్ భారీ రెమునరేషన్ డిమాండ్ చేసి సినిమాకి ఓకే అన్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే మహేష్, కొరటాల కాంబోలో రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. కొరాటలతో ఉన్న అనుబంధం కారణంగా మహేష్.. చిరు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తన మామయ్య చిరుతో నటించాలని చానాళ్లుగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. ఆ పాత్రను తనకు ఇవ్వాలని.. అల్లు అర్జునే స్వయంగా మహేష్ ను సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

తాను చిరంజీవితో నటించాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నానని, ఇటువంటి క్యారెక్టర్ ను తనకు వదిలేయాలని మహేశ్ కు చెప్పిన బన్నీ, ఇదే విషయాన్ని రామ్ చరణ్ తోనూ చెప్పాడట. ఈ విషయంలో తన తండ్రి అరవింద్ ను కూడా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం మెగా ఫ్యామిలీ హీరో కంటే బయట హీరో చేస్తేనే ఆ పాత్ర బాగుంటుందని భావిస్తున్నాడట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -