Friday, April 26, 2024
- Advertisement -

సెట్ లో కో డైరెక్టర్ పై సీరియస్ అయిన బన్నీ?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగుతున్న సమయం లో ప్రస్తుతం సినిమా సెట్స్ పై జరిగిన ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

షూటింగ్ సమయం లో అల్లు అర్జున్ కి, సినిమా కో డైరెక్టర్ సత్యం కి మధ్య చిన్నపాటి వివాదం జరిగిందట. అయితే ఈ విషయం ప్రస్తుతానికి కో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ప్రచారం జరుగుతుంది. సెట్ కి రమ్మని అల్లు అర్జున్ కి రెండు సార్లు కబురు పెట్టినా రాలేదని, మూడో సారి కూడా పిలవాల్సి వచ్చిందని, తన కారవాన్ లో హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటె ఈ డిస్టర్బెన్స్ నచ్చక అల్లు అర్జున్ వచ్చి దర్శకుడి ముందే స్క్రిప్ట్ పేపర్స్ ని గాల్లో విసురుగా వేసి అందరి ముందు ఆయనని అరిచాడని టాక్ నడుస్తుంది.

అయితే ఈ విషయానికి హర్ట్ అయినా కో డైరెక్టర్ అసోషియేషన్ లో ఫిర్యాదు చేసాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారని టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అటు అల్లు అర్జున్ ఇగో హర్ట్ అవ్వకుండా, ఇటు కో డైరెక్టర్ ఇగో హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య సయోధ్య తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -