Friday, April 26, 2024
- Advertisement -

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన అనసూయ..?

- Advertisement -

జబర్దస్త్ లో మాములు ఆర్టిస్ట్ గా వచ్చిన హైపర్ ఆది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా టీం లీడర్ గా ఎదిగాడు. కేవలం జబర్దస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లు చాలా మంది అనడంలో అతిశయోక్తి కాదు. జబర్దస్త్ లో చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. కాకపోతే సినిమాల్లో హైపర్ ఆదికి పెద్దగా కలిసిరాలేదు. అందుకే ఎక్కువ బుల్లితెరపైనే కనిపిస్తున్నాడు.

ఇక జబర్దస్త్ షోలో అనసూయ పై హైపర్ ఆది ప్రతి స్కీట్ లో ఏదో ఒక పంచ్ వేస్తూనే ఉంటాడు. అనసూయ కూడా ఆది పంచులకు ఎంజాయ్ చేస్తూ పడి పడి నవ్వుతోంది. ఇక షో జడ్జెస్ నాగబాబు, రోజా కూడా హైపర్ ఆది స్కీట్ కు తెగ నవ్వుతారు. కానీ గత కొన్ని ఎపిసోడ్స్‌లో హైపర్ ఆది చేసే స్కిట్స్‌లో అనసూయ పై చేసే కామెడీ తారా స్థాయికి చేరింది. అయితే ఇటీవలే ఓ ఎపిసోడ్ లో ABCDEFGHIJK అంటూ అనసూయపై పంచులు వేస్తూ ఆటపట్టించాడు.

ఈ స్కీట్ లో అనసూయను ABCD అంటు ఒక అర్దం చెప్పి.. IJK పదానికి ఐయామ్ జస్ట్ కిడ్డింగ్ అంటు చెప్పిన డైలాగ్ కు అనసూయ అవాక్కైంది. అయితే ఈ షో తర్వాత హైపర్ ఆదికి అనసూయ కాస్తంత గట్టిగానే క్లాస్ పీకినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు నాగబాబు, రోజా కూడా అది చేసే స్కిట్స్ విషయంలో కాస్తంత సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -