Friday, April 26, 2024
- Advertisement -

బిగ్‌బాస్ 4లో యాంకర్ వర్షిణి.. క్లారిటీ ఇచ్చింది..!

- Advertisement -

ప్రపంచంలోనే అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో. ఇది తెలుగులో ఇప్పటికే మూడూ సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అందరు ఓ ఇంట్లో ఉంటూ.. మధ్య మధ్యలో టాస్క్‌ల పేరటి వారిలో దాగి ఉన్న కోణాలను బయటకు తీయడమే బిగ్‌బాస్ ఉద్దేశ్యం. అన్ని భాషల్లో ఈ బిగ్ బాస్ షోని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ కు రెడీ చేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ షో అనేది గ్రాండ్ సక్సెస్ అయింది.

ఎన్టీఆర్ మొదటి సీజన్‌ను , నాని రెండో సీజన్‌ను, నాగార్జున్ మూడో సీజన్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి పనులు మొదలయ్యాయి. ఈ నాల్గో సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయబోతోన్నాడు. బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రధానంగా పరిశీలనలో ఉన్నవారిలో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్ పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కొందరితో చర్చలు పూర్తయ్యాయని, వారికి సంబంధించిన రెమ్యునరేషన్ల విషయంపై రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనేది తెలిసింది.

ప్రతీసారి ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలెబ్రిటీని తీసుకొచ్చే బిగ్ బాస్ బృందం ఈ సారీ అలాంటి పద్దతినే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెపథ్యంలో యాంకర్ కేటగిరీ లిస్ట్‌లో వర్షిణి ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీపై ఆమె క్లారిటీ ఇస్తూ.. నిజానికి తాను సీజన్ 2, సీజన్ 3లలో రావాల్సి ఉందని, బిగ్ బాస్ నిర్వాహకులు తనతో చర్చించారని చెప్పారు. తాను అప్పటికే కొన్ని షోలు చేస్తుండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదని తెలిపింది. అందుకే వెళ్లలేకపోయానని పేర్కొంది. అయితే నాల్గో సీజన్‌కు సంప్రదిస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -