దిల్ రాజు రెండో పెళ్లి డేట్ ఫిక్స్…? అమ్మాయి ఎవరంటే…?

2342
Another Rumor on Dil Raju's second marriage
Another Rumor on Dil Raju's second marriage

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. గత కొన్ని రోజుల నుంచి దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంత వరకు ఆయన రెండో పెళ్లికి సంబంధించిన వార్తను ఎవరూ ఖండించలేదు.

అయితే తాజాగా ఇప్పుడు దిల్ రాజు రెండో పెళ్లి ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం మారింది. అయిన చేసుకోబోయే అమ్మాయి గతంలో ఆమె ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని, చాలా కాలంగా ఇద్దరూ స్నేహితులని చెబుతున్నారు. దిల్ రాజు వయసు 50లలో ఉండగా… పెళ్లి కూతురు వయసు 30 ఏళ్లని అంటున్నారు.

ఆయన ఏ సినిమా చేసిన హిట్ గ్యారేంటి అనే ముద్ర వేసుకున్నాడు. ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి. ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయి.. ఇలా ఎలాంటి డీల్ అయిన చేయగలడు. అందుకే ఆయనను నమ్మి చాలా మంది హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. ప్రొఫెషన్ పరంగా ఇంత సక్సెస్ ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో భారీ విషాదమే ఉంది ఆయనకు.

మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య కారణాలతో చనిపోయారు. కొన్నాళ్ల పాటు ఆ షాక్ నుంచి ఆయన బయటకు రాలేకపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కూతురుకి కూడా ఆయన పెళ్లి చేసేశారు. దీంతో, ఆయన ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన రెండో వివాహానికి కూతురు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.

Loading...