Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖినే.. బయటపడ్డ నిజం..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై తనధైన శైలిలో రాణించి మంచి సక్సెస్ అయింది శ్రీముఖి. యాంకర్ గా చాలా షోస్ చేసినప్పటికి పటాస్ ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టింది. సినిమాల్లో కనిపిస్తూనే బుల్లితెరపై అలరించింది. ఆమె క్రేజ్ చూసి బిగ్ బాస్ ఆఫర్ వెతుకుంటూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన శ్రీముఖి మంచి గేమ్ ప్లే చేస్తూ రాణించింది. రాహుల్ తో గొడవ విషయంలో కూడా శ్రీముఖి బాగా హైలైట్ అయింది.

అందరి కంటెస్టెంట్లో శ్రీముఖి ఎప్పుడు స్ట్రాంగ్ ఉండేది. అయితే బిగ్ బాస్ చివరి వారం లో శ్రీముఖి, రాహుల్, అలీ, వరుణ్, బాబా మాస్టర్లు ఉన్నారు. వీరిలో శ్రీముఖి, రాహుల్ కు బాగా క్రేజ్ వచ్చింది. దాదాపు ఇద్దరికి సమానంగా ఓట్లు పడుతున్నాయి. అయితే శ్రీముఖికే టైటిల్ విన్నర్ దక్కుతుందని కొంత కాలంగా అందరు అనుకుంటున్నారు. ఆమె కోసం బయట ఆమె టీం బానే ప్రచారం చేసింది. ఎలాగో ఫాలోయింగ్ ఉంది. ప్రచారం వల్ల మరింత క్రేజ్ శ్రీముఖికి వచ్చింది.

ఇక బిగ్ బాస్ 3 విన్నర్ గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ ఉంది. అయితే ఈ క్రమంలో ఈ ఆదివరం నాడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఫినాలేలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన ఓ ఫోటో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో బిగ్ బాస్ టైటిల్ అందుకున్న శ్రీముఖిని.. హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్లు ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ పోస్టు కు జనాల నుంచి మాత్రం విపరీతమైన స్పందన వస్తోంది. మరి అసలు విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ అదివారం వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -