Saturday, April 20, 2024
- Advertisement -

భారత గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ రాహుల్ ద్రవిడ్..!

- Advertisement -

భారత టెస్టు క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మెన్‌ ఎవరు ? అనగానే అందరు సంచిన్ అనుకుంటాం. ఆ తర్వాత గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా ఉండొచ్చని చాలా మంది అంటూ ఉంటారు. గత 50 ఏళ్లలో భారత గొప్ప టెస్టు బ్యాట్స్‌మెన్ ఎవరు..? ఇదే ప్రశ్నతో విజ్డెన్ ఇండియా ఓ పోల్‌ని నిర్వహించగా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ ద్రవిడ్ విజేతగా నిలిచారు.

పోల్‌లో మొత్తం 11,400 మంది అభిమానులు పాల్గొన్ని తమ అభిప్రాయం చెప్పారు. రాహుల్ ద్రవిడ్‌కి ఏకంగా 52 శాతం ఓట్లు పడినట్లు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. సచిన్ ఆఖరి వరకూ గట్టి పోటీనిచ్చినా రెండో స్థానానికి పరిమితమైనట్లు వెల్లడించిన విజ్డెన్ ఇండియా.. విరాట్ కోహ్లీ, సునీల్‌ గవాస్కర్ వరుసగా 3, 4 స్థానాలతో నిలిచారు.

సచిన్ టెండూల్కర్ 200 టెస్టులాడారు. 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇక రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులాడి 52.31 సగటుతో 13,288 రన్స్ చేయగా.. సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఆఖరిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన 86 టెస్టుల్లోనే 53.62 సగటుతో 7,240 పరుగులు చేశాడు.

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

జడేజా బెస్ట్ ఫీల్డర్ అని చెప్పే సాక్ష్యం ఇది..!

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -