Friday, April 26, 2024
- Advertisement -

దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా ?

- Advertisement -

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. ఆయన ఏ సినిమా చేసిన హిట్ గ్యారేంటి అనే ముద్ర వేసుకున్నాడు. ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి. ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయి.. ఇలా ఎలాంటి డీల్ అయిన చేయగలడు.

అందుకే ఆయనను నమ్మి చాలా మంది హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. ప్రొఫెషన్ పరంగా ఇంత సక్సెస్ ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో భారీ విషాదమే ఆయనకు ఉంది. ఆయన సతీమణి అనిత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేశారు. ఇప్పుడాయన ఒక్కడే ఉంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. ఇంటికి వచ్చాక నా అనే వాళ్లు లేకుంటే ఆ బాధ వేరే ఉంటుంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఉన్నట్లు చెబుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు.. సినిమా ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని ఒక బ్రాహ్మణ యువతిని దిల్ రాజు పెళ్లి చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలో ఎంత నిజమన్నది ఇప్పుడు తేల్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో పెళ్లి ఏ మాత్రం తప్పు కాదు. ఇక దిల్ రాజు లాంటి వ్యక్తి ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి అని చెప్పొచ్చు. మరి ఈ పెళ్లి వార్తపై దిల్ రాజు ఎలా స్పందింస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -