Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ నిర్ణయంతో ఆయా ఫాన్స్ కి నచ్చట్లేదు ?

- Advertisement -

‘ ఏ హీరోకైనా ఇలాంటి లైనప్ లు ఉండాలి రా, వరసగా సూపర్ డైరెక్టర్ లు ‘ అనుకునే రీతిలో సాగుతోంది మహేష్ బాబు కెరీర్. కొరటాల శివ తరవాత , అడ్డాల శ్రీకాంత్ తో బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తైన తరవాత మురుగదాస్ సినిమాకి సంతకం పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రకటించిన తరవాత మహేష్ ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ – మురుగదాస్ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే విజయ్ కి కత్తి పడినట్టు తమ హీరోకి మరొక ఇండస్ట్రీ హిట్ ఖాయం అని నమ్ముతున్నారు వారు. ఈ తరుణంలో వస్తున్న వార్తలు చూస్తే మహేష్ ఫాన్స్ డీలా పడ్డట్టు అనిపిస్తోంది.

మహేష్ బాబు ని అప్పట్లో కలిసిన శేఖర్ కమ్ముల మహేష్ కి కథ వినిపించడం అది మహేష్ కి పెద్దగా నచ్చకపోవడం తెలిసిందే. అయితే అప్పుడు శేఖర్ ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు కథలు మహేష్ కి వినిపించాడు అని నాలుగూ చాలా సాఫ్ట్ కథాంశాలు అనీ చెబుతున్నారు.

మురుగదాస్ లాంటి డైరెక్టర్ తో ఒక భారీ యాక్షన్ స్టోరీ తీసిన తరవాత మహేష్ బాబు ఒక సున్నితమైన కథ ని ఎంచుకుంటాడు అని అది శేఖర్ దర్సకత్వం లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు అని చెబుతున్నారు. మహేష్ బాబు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఫాన్స్ దిగామింగుకో లేక పోతున్నారు.

శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , అనామిక లాంటి సినిమాలతో ఫార్మ్ కోల్పోయాడు ఈ సమయంలో మహేష్ ఆయనకీ సినిమా ఇవ్వడం అంటే చాలా పెద్ద రిస్కే . అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -