Saturday, April 27, 2024
- Advertisement -

హైపర్ ఆది పెళ్లి తేది ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే ?

- Advertisement -

జబర్దస్త్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుని నెంబర్ వన్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు హైపర్ ఆది. అయితే ఆది కేవలం కామెడీ చేయడమే కాదు స్క్రిఫ్ట్ రైటర్ గా చేశాడు. జబర్దస్త్ లో చాలా స్కిట్స్ రాశాడు. ఢీ షోకి కూడా రాసాడు. అలానే ఢీ షోలో కూడా ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతున్నాడు.

అయితే బుల్లితెరపై ఉన్న కమెడీయన్స్ లో ఎక్కువ మంది ఫాలోయింగ్ మాత్రం ఆదికే ఉన్నారని చెప్పాలి. ఇక కొన్నాళ్లుగా ఆది ఎఫైర్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య అనసూయతో చనువుగా ఉంటున్నాడని వార్తలు రాగా, ఇటీవల యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని పుకార్లు వచ్చాయి. అలాగే తన కంటే ముందు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు. అయితే తాజాగా తన నిర్ణయం మార్చుకున్నాడని తెలుస్తోంది. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. తాజా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

అలాగే పెళ్లి డేట్, వధువు ఎవరనే విషయాన్ని కూడా చెప్పి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమ పెళ్లి అవుతుందని, అది కూడా తమ సొంత జిల్లా ప్రకాశంకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఆది. ఇక బుల్లితెరపైనే కాకుండా.. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు హైపర్ ఆది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన ఆది.. ఇటివలే వెంకీ మామ సినిమాలో చైతు ఫ్రెండ్ గా నటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -