విజయ్ దేవరకొండ హీరోయిన్లకు అవకాశాల కరువు

465
No Offers to Vijay Devarakonda Actress
No Offers to Vijay Devarakonda Actress

విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు తెలుగు సినిమా పరిశ్రమ లో. అస్సలు బ్రేక్ లేకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు ఈ హీరో. కానీ అదేంటో గానీ ఈయన పక్కన చేసిన హీరోయిన్లు కొందరికి మాత్రం అవకాశాలు అస్సలు రావడం లేదు. అంతే కాదు పైగా అవి హిట్ సినిమాలు కూడా.

విజయ్ కెరీర్ లో నే మొదటి హిట్ పెళ్లి చూపులు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కి ఆశించిన స్థాయి లో బ్రేక్ ఇంకా రాకపోవడం కాస్త విచిత్రం గా నే ఉంది. ఈ భామ అటు నటన లో మరియు పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేసినా ఎందుకో ఆశించిన స్థాయి లో మెప్పించలేకపోయింది.

ఇకపోతే ఇంకో హీరోయిన్ షాలిని పాండే. అర్జున్ రెడ్డి విజయం తో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కానీ షాలిని మాత్రం అస్సలు గ్రోత్ చూడలేదు. తనకి రావాల్సిన అవకాశాలు రావడం లేదు. ఇక ముచ్చటగా మూడో హీరోయిన్ ఎవరంటే ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా లో పని చేసిన ఈ హీరోయిన్ కూడా అవకాశాలు లేక ఎదురు చూస్తుంది అని చెప్పుకోవచ్చు. విజయ్ దృష్టి సారిస్తే వీళ్ళకి అవకాశాలు క్షణాల్లో వచ్చేస్తాయి!

Loading...