పవన్ తో చేయడం లేదు.. కానీ మహేష్ సినిమా చేస్తా : రేణు దేశాయ్

997
Pawan Kalyan Ex Wife Renu Desai React About Mother Character Offers
Pawan Kalyan Ex Wife Renu Desai React About Mother Character Offers

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈమె పవన్ తో కలిసి బద్రి, జానీ సినిమాల్లో నటించింది. అంతేగాక తమిళంలో కూడా ఖుషి అనే చిత్రంలో నటించింది. అయితే పవన్ ను పెళ్లి చేసుకున్న రేణు.. కొన్ని కారణాల వల్ల విడిపోయింది. గత కొద్దికాలంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా చిట్ చాట్ కార్యక్రమం తన అభిమానులతో ద్వారా ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ “టాలీవుడ్ స్టార్ హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే మీరు నటిస్తారా వదిన.?” అంటూ అడిగాడు. దీంతో రేణు దేశాయ్ స్పందిస్తూ కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా మహేష్ బాబుకి తల్లిగా నటించడానికి తనకు ఓకే కానీ తనని మహేష్ బాబు తల్లి పాత్రకి కచ్చితంగా సూటవుతానాని దర్శక నిర్మాతలు భావిస్తే అందుకు సిద్ధమేనంటోంది రేణు దేశాయ్.

ఇక సినిమా ఫీల్డ్ లో ఉంటే ఏ పాత్ర అయిన చేయడానికి రెడీగా ఉండాలని చెబుతోంది. ఇక పవన్ చాలా కాలం తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని గతంలో పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆమె.. పవన్ సినిమాలో నటించడం లేదని తెలిపింది. ప్రస్తుతం రేణు దేశాయ్ నటన కంటే దర్శకత్వం వైపు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Loading...