సాయి కుమార్ కి రాజశేఖర్ కి బ్రేకప్?

570
Rajasekhar and Sai Kumar Break Up Again
Rajasekhar and Sai Kumar Break Up Again

రాజశేఖర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కల్కి ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని రాజశేఖర్ ముందు నుండి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా కి అన్నీ బాగా నే కలిసి వస్తున్నాయి కానీ ఒక్క విషయం మాత్రం సరిగా లేదు. అదేంటంటే రాజశేఖర్ వాయిస్. ట్రైలర్ చూసిన చాలా మందికి రాజశేఖర్ వాయిస్ తేడా కొట్టినట్టు తెలుస్తుంది. ఈ సారి రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పలేకపోయాడు అని టాక్ నడుస్తుంది. అప్పట్లో ఒకసారి ఇలా రాజశేఖర్ కి సాయి కుమార్ కి బ్రేకప్ అవ్వడం వలన చాలా సినిమాలకి కొత్త వాయిస్ తో రాజశేఖర్ ట్రై చేశారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు.

చివరికి గరుడవేగ సినిమా కి మళ్ళీ వీరు ఇద్దరు కలిసి పని చేశారు. కానీ ఎందుకో ఇప్పుడు కల్కి కి మాత్రం సాయి కుమార్ వాయిస్ లేదు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సారి సాయి కుమార్ నటుడిగా బిజీ గా ఉండడం వలన రాజశేఖర్ కొత్త వాయిస్ వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది అని టాక్ వినిపిస్తుంది.

Loading...