Saturday, April 27, 2024
- Advertisement -

లాక్ డౌన్ వల్ల రకుల్ కు ఎన్ని కష్టాలో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతో సినిమా పరిశ్రమ కూడా పూర్తిగా ఆగిపోయింది. సినీ కార్మికుల నుండి స్టార్స్ వరకు కూడా చాలా నష్టపోతున్నారు. సినిమా షూటింగులు లేకపోవడంతో.. సినిమాలు రిలీజ్ లు ఆగిపోవడంతో అన్ని వర్గాల వారు చాలా నష్టపోతున్నారు. ఈ టైంలో హీరోయిన్ రకుల్ ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే ఎక్కువగా నష్టపోతుంది. ఆమెపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

రకుల్ కు గత ఏడాది కాలంగా సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ టైంలో లాక్ డౌన్ షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు భవిష్యత్తులో సినిమాల మేకింగ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. దాంతో రకుల్ మళ్లీ హీరోయిన్ గా బిజీ కావడం దాదాపుగా అసాధ్యం అనిపిస్తోంది. ఇక హీరోయిన్ గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రకుల్ నష్టపోతుంది. రకుల్ కు హైదరాబాద్ వైజాగ్ ల్లో జిమ్ సెంటర్స్ ఉన్న విషయం తెల్సిందే. హైదరాబాద్ లో రెండు, వైజాగ్ లో ఒక జిమ్ సెంటర్లు ఉన్నాయి.

లాక్ డౌన్ కాకముందు ఈ జిమ్ సెంటర్లు బానే నడిచేవి. కానీ గత నెలన్నర రోజులుగా పూర్తిగా జిమ్ సెంటర్ మూసి వేయాల్సిన పరిస్థితి. మరో రెండు నెలలపాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జిమ్ సెంటర్ ల మెయింటెన్స్ మరియు అందులో ఉద్యోగులకు జీతాలు నెలకు లక్షల్లో తన సొంతంగా ఇవ్వాల్సి వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె మరింతగా ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి ఏమవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -