ఐదేళ్ళ అనుబంధం.. నమ్మించి మోసం చేశారు : సాయి సుధా

1259
Sai Sudha files cheating case against Shyam K Niadu
Sai Sudha files cheating case against Shyam K Niadu

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి సాయి సుధ పోలీసు కేసు పెట్టడంతో.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్లుగా బాంధవ్యం కొనసాగిస్తున్నా.. ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే తాను పోలీసు కేసు పెట్టాల్సి వచ్చిందని సాయి సుధ చెప్పింది. శ్యామ్ కి తన భార్యతో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాతో పరిచయం అయింది. మేమిద్దరం ఓ రెండు సినిమాలకు పనిచేశాం.

ఐదేళ్ళ నుండి తనతో అనుబంధం ఉంది. ఇప్పుడు భార్యతో ఉంటున్నందున నన్ను దూరం పెడుతున్నాడు. కలిసిన ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే అతడి మీద చీటింగ్ కేసు పెట్టాను అని తెలిపారు. 2012లో ఆయనతో పరిచయం ఏర్పడింది. 2015 నుంచి రిలేషన్ కొనసాగించాం. ఆయన భార్యతో గొడవల కారణంగా నాకు దగ్గరయ్యారు. మా అనుబంధానికి రుజువులు.. సాక్ష్యాలు ఉన్నాయి. ఆడియో.. వీడియో ఫైల్స్ ఉన్నాయని సాయి సుధ తెలిపారు. భార్యతో సమస్య సద్ధుమణిగాక నాకు ముఖం చాటేస్తున్నాడని వెల్లడించారు. ఇక ఈ ఎపిసోడ్ లో తమ పెళ్లి చేస్తామని శ్యాం కే సోదరుడు చోటా కే నాయుడు మాటిచ్చారని తమకు అండగా నిలిచారని కూడా సాయి సుధ చెబుతున్నారు.

ఇంటి గొడవలు సద్ధుమణిగితే పెళ్లి చేస్తామని మాటిచ్చారని.. అయితే ఇప్పుడు ఆయన కూడా తనకు తెలియదని తప్పించుకొంటున్నారు అని సాయి సుధ వెల్లడించారు. శ్యాం కే నాయుడుతో అఫైర్ విషయం హీరో సందీప్ కిషన్ తల్లికి కూడా తెలుసు. పలు మార్లు కేసు పెట్టడానికి వస్తుంటే ఆ కుటుంబసభ్యులు ఆపారు. ఇప్పుడు అంతా ఏకమై నన్ను చీట్ చేశారు అని ఆవేదన చెందారు. అంతే కాదు చోటా కే కుటుంబం తనని బెదిరించిన విషయాలు.. తనను హెచ్చరించినవి కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని సాయి సుధ చెబుతున్నారు.

Loading...