Friday, April 26, 2024
- Advertisement -

చైతన్య, సాయి పల్లవి లిప్ లాక్ పై సమంత ఏమన్నాదో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే వెంటనే అదరికి గుర్తొచ్చేది సమంత, నాగచైతన్య. వీరు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అయితే సాయి పల్లవి ఎలాంటి సీన్ లో అయిన జీవించేస్తోంది.

అలాగే ‘లవ్ స్టోరి’లో కూడా లవ్ ఫీల్ ఉన్న సీన్స్‌లో ఒక రేంజ్‌లో జీవించిందట. అయితే ఈ సినిమాలో ఫీల్‌తో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా జోడించారు శేఖర్ కమ్ముల. దానిలో భాగంగా కొన్ని కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో సాయి పల్లవి చైతూకి గట్టిగా ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉంది. అయితే, సినిమాలో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి అంటున్నారు. అయితే వీటి గురించి సమంత ఫీలింగ్ ఏంటి మరి ? అనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస. అయితే చైతు, సామ్, దివ్యాన్ష నటించిన మజిలీ సినిమాలో చైతు దివ్యాన్ష మధ్య ఓ లిప్ లాక్ ఉంది.

ఆ సీన్ గురించి సమంత మాట్లాడుతూ అదంతా పార్ట్ అఫ్ ప్రొఫెషన్ అని చెప్పింది. అయితే ఇప్పుడు లవ్ స్టోరి లో చాలా కిస్ సీన్స్, క్యూట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత హీరోయిన్ అయినా సమంత కూడా అమ్మాయే కదా.. అమ్మాయిలకు పొసెసివ్‌నెస్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. మరి, ఈ సినిమా చూసిన తరువాత సమంత స్పందన ఎలా ఉంటుంది అనే డిస్కషన్ నడుస్తుంది. అయితే అందుతున్న సమాచారం మేరకు సినిమాల్లో ఇలాంటి సీన్స్ చాలా కామన్.. పర్సనల్ గా తీసుకోవద్దని తన సన్నిహితుల వద్ద సామ్ అంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -