Friday, April 26, 2024
- Advertisement -

సందీప్ కిషన్ ప్రేమలో ఉన్న హీరోయిన్ ఎవరు?

- Advertisement -

‘నెక్స్ట్ ఏంటి’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న యువ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ సినిమా పాత సంగతి పక్కన పెడితే ఇప్పటికే సందీప్ కిషన్ ఆ హీరోయిన్ తో డేట్ చేస్తున్నాడు, ఈ హీరోయిన్ తో డేట్ చేస్తున్నాడు అంటూ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా సందీప్ కిషన్ ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు అని చెబుతున్నారు. దానికి కారణం ఈ మధ్యనే సందీప్ కిషన్ చేసిన ఒక ట్వీట్.

ఈ మధ్యనే ‘నిను వీడని నీడను నేనే’ సినిమా నుంచి ‘ఎక్స్క్యూజ్ మీ రాక్షసి’ అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆ పాటను ట్వీట్ చేస్తూ “ఈ సో కాల్డ్ మ్యాజికల్ ఫీలింగ్ గురించి నాకేమీ తెలియదు అనుకున్న సమయంలో నేను నిన్ను కలిశాను. ఈ పాట నీకే డెడికెట్ చేస్తున్నాను. నువ్వు ఎవరో నీకు తెలుసు కదా.. ప్యాకప్ అవ్వగానే ఈ పాట ఒకసారి విను” అంటూ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ద్వారా సందీప్ కిషన్ ఒక హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -