Friday, April 26, 2024
- Advertisement -

RRRలో ఎన్టీఆర్ కు బాబాయిగా మోహన్ లాల్ ?

- Advertisement -

రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. అయితే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎక్కడ స్పందించలేదు. అసలు మోహన్ లాల్ ఈ సినిమాలో నటించబోతున్నాడా లేదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకుండానో మరో వార్త సినీ ప్రేమికులకు సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది.

చారిత్రక ఆధారాల ప్రకారం కొమురం భీంలో పోరాట స్ఫూర్తిని కలిగించింది ఆయన బాబాయి. భీం లో ఉద్యమ నాయకుడి లక్షణాలు పెంపొందించింది ఆయన బాబాయి అవ్వడం వల్ల సినిమాలో ఆ పాత్రను కీలకంగా దర్శకుడు రాజమౌళి చూపించాలని భావిస్తున్నాడట. అందుకే ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఎంపిక చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు మరోసారి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయనకు జోడిగా ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఇంగ్లీష్ నటి ఓలివియా నటిస్తోంది. లాక్ డౌన్ అయిపోగానే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనుంది ఆర్ ఆర్ ఆర్ యూనిట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -