తనకన్న 15 ఏళ్ల యువకుడితో హీరోయిన్ రొమాన్స్..!

4901
sushmita sen romantic workout with rohman shawl
sushmita sen romantic workout with rohman shawl

సుస్మితా సేన్.. మోడలింగ్ ద్వారా కెరీర్ ను మొదలు పెట్టి తర్వాత చాలా అవార్డులు అందుకుని మిస్ యూనివర్స్ గా నిలిచింది. సినిమాల్లోకి వచాక తన నటనతో, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆమె తీరు హాట్ టాపిక్ గా మారింది. తనకంటే చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది.

విషయంలోకి వెళ్తే.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం ‘నిర్భాక్’ తర్వాత కనిపించలేదు. సినిమాల్లో ఉన్నప్పుడే పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించింది. కానీ ఎవర్ని పెళ్లి చేసుకోలేదు. తల్లి కావాలన్న ఆశతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. 44 ఏళ్ల సుస్మితా సేన్ పెళ్లి చేసుకునేందుకు ఇష్ట పడలేదు. కానీ, చాలా మందితో డేటింగ్ మాత్రం చేసిందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక, కొద్ది రోజులుగా ఆమె రొహమన్ షాల్ (29) అనే ఈ యువ మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఏకంగా అతడని ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంది.

దీంతో ఆమె వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రొహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు రావడంతో సుస్మితా సేన్ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలో అతడితో కలిసి రొమాన్స్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటిలో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అతడిని సుస్మితా పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సుస్మితా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...