బాలయ్య సినిమాలో రోజా.. ఇక సంచలనమే..!

1131
Will YCP MLA Roja to act with Nandamuri Balakrishna in Boyapati Srinu movie
Will YCP MLA Roja to act with Nandamuri Balakrishna in Boyapati Srinu movie

బాలకృష్ణ, రోజా కాంబినేషన్ సెట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. 90ల్లో శ్రీ కృష్ణార్జున యుద్ధం, గాంఢీవం, సుల్తాన్, మాతో పెట్టుకోకు, భైరవద్వీపం, పెద్దన్నయ్య, బొబ్బిలి సింహం లాంటి సినిమాల్లో నటించారు బాలయ్య, రోజా. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని హిటే. ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు.

తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ప్రస్తుతం రూలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటితో కలిసి చేయనునాడు. ఇది బాలయ్యకు 106వ సినిమా. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ కోసం రోజాను అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలయ్య, రోజా ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రోజా బుల్లితెరపై జబర్దస్త్ కెరీర్ కొనసాగిస్తుంటే.. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు.

ఇక తన సినిమాలో ఫైరింగ్ కారెక్టర్ రోజాతో చేయించాలని బోయపాటి చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. బోయపాటి ఆఫర్‌కు రోజా కూడా అలోచించి చెప్తానని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే రాజకీయంగా టీడీపీతో రోజాకు విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలయ్య సినిమాలో రోజా నటిస్తుందో లేదో చూడాలి.

Loading...