Friday, April 26, 2024
- Advertisement -

ర‌ద్దైన నోట్ల లెక్క తేలింది…

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండేళ్ల కింద‌ట న‌వంబ‌ర్‌లో రాత్రికి రాత్రే నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ సంల‌చ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మోదీ నిర్ణ‌యం దేశంలోని రాజ‌కీయ పార్టీలు, సామాన్య ప్ర‌జ‌లు షాక్ కు గురయ్యారు. భారీగా నల్లధనాన్ని వెలికితీస్తానంటూ మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌యిన సంగ‌తి తెలిసందే.

ర‌ద్ద‌యిన నోట్ల లెక్క తేలింది. బ్యాంకులకు రద్దయిన నోట్లు రూ.15 లక్షల 30 వేల కోట్ల వరకు వచ్చాయని ఆర్బీఐ బుధవారం తెలిపింది. 99.3 శాతం రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. కేవలం రూ.10 వేల 700 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకులకు రాలేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. నిజానికి నోట్ల రద్దు చేసిన తర్వాత సుమారు రూ.5 లక్షల కోట్ల నల్లధనం తిరిగి బ్యాంకులకు రాదని కేంద్రం ముందుగా అంచనా వేసింది.

రద్దయిన పాత నోట్ల ప్రాసెసింగ్‌, తనిఖీ ప్రకియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. బ్యాంకులకు చేరిన స్పెసిఫైడ్‌ బ్యాంక్‌ నోట్ల (ఎస్‌బీఎన్‌)ను హైస్పీడ్‌ కరెన్సీ వెరిఫికేషన్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థ (సీవీపీఎస్‌)లో తనిఖీ, లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -