Friday, April 26, 2024
- Advertisement -

ఐటీ సమన్లు: అహ్మద్ పటేల్ నోరువిప్పితే బాబు పని మటాష్?

- Advertisement -

అది ఎన్నికల సమయం.. బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న టీడీపీ అధినేత, నాటి ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా తనకు వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీతోనే కలిశారు. పొత్తు పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దెనెక్కించాలని బాబు ఎక్కని గడప లేదు.. దిగని గడప లేదు. ఆ సమయంలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ కోసం అహ్మద్ పటేల్ కి ఏపి మాజీ సీఎం చంద్ర బాబు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ మేరకు ఏపీలో ప్రముఖ వ్యక్తిని ఐటీ అధికారులు విచారణకు పిలువనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల చంద్రబాబు మాజీ పీఏ ను ఆరు రోజుల‌పాటు విచారించిన ఐటీ అధికారులు 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గత ఏడాది నవంబర్ 11వ తేదిన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ప్రకటన విడుదల చేయడంతో ఆ వ్యక్తి చంద్రబాబే అన్న ప్రచారం సాగింది.

ముంబైకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆంధ్రుడు లంచంగా 150 కోట్లు తీసుకున్నాడని ఐటీ గుర్తించిందని తేలింది. అమరావతి నిర్మాణాల కోసం ఆ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన బాబు అందులో తొలి దశలో 150 కోట్లు లంచంగా తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల్లో డబ్బులు చేతులు మారాయని ఐటీ శాఖ గుర్తించి.. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రమేయాన్ని కనిపెట్టి ఫిబ్రవరి 14వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. అయితే అహ్మద్ పటేల్ మాత్రం తనకు ఆరోగ్యం కూడా బాగాలేదని, అదీగాక పార్లమెంటు వ్యవహారాల్లో బిజీ గా ఉన్నానని గడువు కోరారు. తాజాగా మరోసారి ఐటీశాఖ నోటీసులు పంపింది.

ఈ రెండు వ్యవహారాల్లో ఐటీ శాఖ దూకుడుగా ముందుకెళ్తోంది. అహ్మద్ పటేల్ నోరు విప్పినా.. 150 కోట్ల ముడుపుల కేసు తేలినా చంద్రబాబు అరెస్ట్ కావడం.. జైలుకెళ్లడం ఖాయమన్నా ప్రచారం సాగుతోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -