Friday, April 26, 2024
- Advertisement -

మంత్రి లోకేష్‌, చంద్ర‌బాబుపై మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు….

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై మాజీ సీఎస్ అజయ్ కల్లాం నిప్పులు చెరిగారు. నెల్లూరులో జరిగిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. గ‌తంలో మ‌రో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు బాబు పాల‌న‌పై నిప్పులు చెరిగిన సంగ‌తి తెల‌సిందే.

ఏపీలో రాజరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలు వచ్చాయి..ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన పెత్తనం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక రోజు ఎమ్మెల్యేగా కూడా చేయని వారు మంత్రులు అవుతున్నారని పరోక్షంగా మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థలకు ప్రజలే చెక్‌ పెట్టాలని కోరారు.

తమిళనాడు పుణ్యమా అని సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఇక్కడా వచ్చిందని అన్నారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన నేతలు ఈరోజుల్లో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాగ్‌ తప్పుబట్టినా ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ప్ర‌భుత్వం వేల‌కోట్లు అప్పు చేస్తోంద‌ని అది ఎవ‌రికోస‌మో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్రజల అభిప్రాయాలకు ప్రస్తుత కాలంలో విలువ లేకుండా పోయిందని అజయ్ కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం పెరిగిపోయింద‌న్నారు.

జిల్లాలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. సింగపూర్‌ విమానం కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు ఆదుకోరు కానీ విమాన ప్రయాణానికి రాయితీలు ఆగమేఘాల మీద చెల్లిస్తారని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -