Saturday, April 27, 2024
- Advertisement -

ఏంటి యూట‌ర్న్‌బాబు అవాక్క‌య్యావా…?

- Advertisement -

ఎం తెల్ల‌ద‌నం ప్రియా అవాక్య‌య్యావా…. అంటు టీవీలో వ‌చ్చే టైడ్ యాడ్ చంద్ర‌బాబుకు స‌రిగ్గా స‌రిపోతుంది. పోలింగ్ ముగిసిన‌ప్ప‌టినుంచి ఈసీ, ఈవీఎంలు,వీవీ ప్యాట్‌ల‌పై ఒ ర‌క‌మైన యుద్దాన్నె కొన‌సాగించారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు వెల్లారు. అయినా కూడా బాబు ప‌ప్పులు ఉడ‌కలేదు. తాజాగా చంద్ర‌గిని నియోజ‌క వ‌ర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీచేయ‌డంతో బాబుతో పాటు టీడీపీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. బాబు అయితే కేంద్ర ఎన్నిక‌ల సంఘంద‌గ్గ‌ర‌కు వెల్లి నానా యాగి చేశారు. రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ద్వివేది ఇత‌ర అధికారుల‌పై ఫిర్యాదు చేశారు. ఆవేశంగా అక్క‌డికి వెల్లిన బాబుపై ఈసీ చ‌ల్ల‌టి నేళ్లు చ‌ల్లింది.

రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన బాబు శుక్రవారం సీఈసీ సునీల్‌ అరోరాను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈసీ నిర్ణయంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు అక్కడ చుక్కెదురైంది. చంద్రగిరిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ పాల్పడిన వీడియోను ఈసీ అధికారులు ఆయనకు చూపించారు. ఇంకే ముంది తెలుగు త‌మ్ముళ్ల రిగ్గింగ్ బాగోతం చూసి బాబు అవాక్క‌య్యారంట‌. ఇంకే ముంది అక్క‌డ నుంచి మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేశారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -