భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

- Advertisement -

భారత ఎన్నికల సంఘం తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర నియమితులు కానున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌లోనే ఈ విష‌య‌న్ని స్ప‌ష్టం చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. కాగా, ప్ర‌స్తుతం భార‌త ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సునీల్ అరోరా పదవీ కాలం మంగ‌ళ‌వారంతో ముగియనుంది.

ఈ క్ర‌మంలోనే సునీల్ అరోరా స్థానంలో ఎన్నికల కమిషన్‌లో అత్యంత సీనియర్ కమిషనర్ అయిన సుశీల్ చంద్రను సీఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, సుశీల్ కుమార్ చంద్ర 1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఆయ‌న ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడానికి ముందు సీబీడీటీ చైర్మన్‌గా పనిచేశారు. మ‌రీ ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో కీలక విధులు నిర్వ‌ర్తించారు.

- Advertisement -

కాగా ఇదివ‌ర‌కు జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు సుశీల్ చంద్ర 14 ఫిబ్రవరి 2019న ఎన్నికల కమిషనర్‌గా నియమితుల‌య్యారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాది మార్చితో ముగియ‌నుంది. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం చీఫ్‌గా నియ‌మితులైతే.. సుశీల్ చంద్ర హయాంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

కరోనా టీకా.. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -