Friday, April 26, 2024
- Advertisement -

కార్పొరేట్ విద్యాసంస్థలకు జగన్ షాక్

- Advertisement -

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి, పేదలకు పెను భారంగా తయారైన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విద్యా, వైద్యానికి తమ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తుందని జగన్ ఈరోజు కలెక్టర్ల మీటింగ్ లో చెప్పిన సంగతి తెలిసిందే..

ప్రస్తుతం సమాజంలో ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకుల పేరిట పరుగులు తీస్తున్నాయి. పది, ఇంటర్, ఎంసెట్ ఫలితాలంటూ ఊదరగొడుతున్నాయి. నర్సరీకే 30వేల వరకు ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజులతో సంపాదించిన సొమ్మంతా సదురు విద్యాసంస్థలకే పెడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం.. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో సదుపాయాలను కల్పించాలని డిసైడ్ అయ్యారు. విద్యార్థులకు యూనిఫాం నుంచి పుస్తకాలు.. మధ్యాహ్న భోజనం ఇలా అన్ని కల్పించి టీచర్లను రిక్రూట్ చేసి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారు.

అంతేకాదు కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. సామన్య కుటుంబాలకు భారంగా మారిన ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టం తేవడానికి రెడీ అయ్యారట.. ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు 25శాతం సీట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారట.. ఇలా జగన్ ప్రైవేటు పాఠశాలల పీచమణిచేందుకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -