Friday, April 26, 2024
- Advertisement -

మ‌రో స‌హాసోపేత నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్… ఇక‌నుంచి ఆ వ్య‌వ‌స్థ ర‌ద్దు..

- Advertisement -

సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో స్పీడ్ పెంచారు. అమరావతి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. పాల‌న‌లో స‌మూల మార్పులు తీసుకొచ్చేందుకు స‌హోసో పేత మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా జ‌గ‌న్ రేష‌న్ డీల‌ర్ల‌కు షాక్ ఇచ్చే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రేష‌న్ డీల‌ర్ల వ్వ‌వ‌స్థ‌ను జ‌గ‌న్ ర‌ద్దు చేయ‌నున్నారు. ప్రభుత్వ అందజేసే రేషన్‌ను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్‌ డీలర్లు ఉండబోరని జగన్‌ వెల్లడించారు. వాలంటీర్లే సరకులను ఇంటింటికీ పంపినీ చేయ‌నున్నారు. ప్రతీ 200 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను ఏర్పాటు చేసి.. ప్రభుత్వ పథకాలను అందరికీ చేరవేయాలని జగన్ నిర్ణయించారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు 1 నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు నిర్దేశించారు. రైస్ ప్యాకింగ్ కోసం.. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ఆటోమేటిక్ ప్యాకింగ్ యూనిట్లకు పనులు అప్పగించాలని సీఎం ఆదేశించారు. రేషన్ బియ్యం పంపిణీకి ఉపయోగించే సన్నబియ్యాన్ని ఖరీఫ్‌లో 1.31లక్షల హెక్టార్లు, రబీలో 3.15లక్షల హెక్టార్లలో పండించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే జ‌గ‌న్ నిర్ణ‌యంపై రేషన్ డీలర్స్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -