ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత

226
AP Ex Speaker Kodela sivaprasad rao passed away
AP Ex Speaker Kodela sivaprasad rao passed away

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బసవతారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఈ ఉదయం ఉరికి వేలాడుతున్న ఆయన్ను గమనించిన కుటుంబీకులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వచ్చే వరకే కోడెల శ్వాస ఆడటం లేదని వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స చేసినా, ఆయన గుండె స్పందించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Loading...