Saturday, April 27, 2024
- Advertisement -

పోలవరంలో రివర్స్ టెండరింగ్ లో జగన్ ప్రభుత్వ గ్రాండ్ సక్సెస్…ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందంటే…?

- Advertisement -

పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని ఎన్నికల ప్రాచారంలో జగన్ సంచలన ఆరోపనలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరానికి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. అనుకున్న విధంగానె అధికారంలోకి వచ్చన వెంటనే రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఒక వైపు రివర్స్ టెండరింగ్ వద్దని కేంద్రం హెచ్చరించినా..మరో వైపు హైకోర్టు కూడా వ్యతిరేకంగా ఉన్నా జగన్ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు కదిలారు.

మొదటి ప్రయత్నంలోనె జగన్ ప్రభుత్వం దేశచరిత్రలోనే తొలిసారిగా తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ లను నిర్వహించింది. 65వ నంబరు ప్యాకేజీ పనుల టెక్నికల్ బిడ్‌లను జలవనరుల శాఖ ఓపెన్ చేసింది. ఈ పనులను గత ప్రభుత్వం రూ.290 కోట్లకు అప్పగించింది. అదే కంపెని అదే పనులను రివర్స్ టెండరింగ్ లో రూ.231.47 కోట్లకు దక్కించుకుంది.

మ్యాక్స్‌వెల్ అనే సంస్థ సుమారు రూ.58 కోట్ల తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ప్రభుత్వం అంచనా వ్యయం కంటే 15.6 శాతానికి బిడ్ దాఖలు చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా కానుంది. ఈ టెండర్లల్లో మొత్తం ఆరు బడా కంపెనీలు పాల్గొన్నాయి. కేవలం మూడు వందల కోట్ల విలువ చేసే టెండర్లలోనే సుమారు రూ.58 కోట్లు ఆదా రావడంతో భవిష్యత్ లో మరిన్ని టెండర్లలో మరింత ఆదాయం వచ్చే అవకావశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్‌గా ప్రకటించి దాని ఆదారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు మాక్స్ ఇన్‌ఫ్రా బిడ్డు దాఖలు చేసింది. మిగిలిన సంస్థకన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -