Saturday, April 27, 2024
- Advertisement -

బోటు వెలికితీతపై వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన ఘోర బోటు ప్రమాదం విషాదం నింపిన సంగతి తెలిసింది. ఈ బోటులో 72మందికి పైగా ప్రయాణించగా.. 27మంది వరకూ సేఫ్ అయ్యారు. 36 మృతదేహాలు గోదావరి నదిలో లభ్యమయ్యాయి. ప్రస్తుతం మునిగిన బోటులో 15మంది వరకూ ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదం నుంచి 26 మందిని రక్షించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు.

ఇప్పటివరకూ కనిపించని గల్లంతైన పదిహేను మృతదేహాలు బోటులోని ఏసీ క్యాబిన్ లోనే ఉండి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. నేవీ సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు ఉత్తరాంఖండ్ కు చెందిన నిపుణుల బృందం సైతం బోటు వెలికితీసేందుకు ఎంతో ప్రయత్నించి విఫలమైంది. ఉధృతంగా ఉన్న గోదావరి ప్రవాహంతో ఇది సాధ్యం కాదని తేల్చారు. దీంతో తాజాగా బోటు వెలికితీయడంలో అనుభవం ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తులకు ఈ ఆర్డర్ ను ఇస్తూ వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. గోదావరిలో వరద ప్రవాహం తగ్గిపోయాక ఈ బోటును వెలికి తీయాలని పేర్కొంది. ఈ బాధ్యతను బాలాజీ వైన్స్ కు అప్పగించినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తాజాగా తెలిపారు. ఓటు వెలికితీతకు నిపుణుల సలహా కూడా తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు. నేటి నుంచి ఆపరేషన్ వశిష్ట ప్రారంభం కానుందని వివరించారు.

కాకినాడకు చెందిన ధర్మాన్ని సత్యం కు సంబంధిచిన బాలాజీ మెరైన్ సంస్థకు ఈ బోటు వెలికితీత కాంట్రాక్టు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. బోటు వెలికితీత కోసం రూ.22.70లక్షల కాంట్రాక్టును సైతం ఇచ్చామన్నారు. తాడు సాయంతో ఈబోటును వెలికి తీస్తారు.

రోజులు గడుస్తున్నాయి కానీ గోదాట్లో గల్లంతైన వారి జాడ మాత్రం తెలియడం లేదు. దీంతో గల్లంతైన వారి కోసం బంధువులు ఆశలు వదిలేసుకున్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి రాకపోతారా అని ఒక చిన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలు మాత్రం రోజురోజుకూ సన్నగిల్లి పోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో ఆందోళన పెరిగిపోతుంది.తమ వారు ప్రాణాలతో బతికి ఉన్నారా లేక బోటు ప్రమాదంలో మరణించారా అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -