Friday, April 26, 2024
- Advertisement -

ఈఎస్ఐ స్కాం లో బీజేపీ నేత.. టెన్షన్ లో కమలనాధులు ?

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో కొత్త కోణాలు వేలుగుచుస్తున్నాయి.. ఇప్పటికే ఈ అవినీతి కేసులో టీడీపి మాజీ మంత్రి అచ్చెం నాయుడు జైలులో ఊచలు లెక్కపెట్టిన సంగతి తెలిసిందే.. ఇటీవలే ఆయన చట్టం నిర్దేశించిన, పూర్తిగా చట్టపరిధి లో ఉన్న బెయిల్ పై బయటకి వచ్చాడు. కింది స్థాయి అధికారులనుంచి చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా వార్తలు రాగ తాజాగా బీజేపీ నేత సుజనా చౌదరి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు తెలంగాణా లో సిబిఐ జరిపిన విచారణ లో తేలింది.. 

ఈఎస్ఐ కుంభకోణం నిధులలో సుజనా సంస్థల వాటాకి సంబంధించిన వివరాలు ఈ దర్యాప్తు లో బయటపడ్డాయి.. ఈ విషయం టీడీపీ , బీజేపీ శిబిరాల్లో కొంత టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పగా ఈఎస్ఐ స్కామ్ నిధులను నేరుగా సుజనా సంస్థలకు మళ్లించిన ఆధారాలు బయటపడ్డాయి అని యా దర్యాప్తులో వెల్లడైంది. సుజనా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తీరు తేటతెల్లమయ్యింది. సుజనా టవర్స్ నుంచి కూడా భారీగా షేర్లు కొనుగోలు చేసిన ఉదంతం కూడా వెలుగుచూసింది. దీనికి సుజనా సన్నిహితుడు హరిబాబు కీలకపాత్రధారిగా పేర్కొంటున్నారు.

ఓమినీ మెడీ, లెజెండ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మందుల కొనుగోళ్ల వ్యవహారంలో గోల్ మాల్ కి ఆధారాలు దొరికాయి. దీంతో సుజనా గ్రూప్ లో ని మరో కీలక మైన వ్యక్తి పై అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం బీజేపీ లో ఉన్నా సుజనా టీడీపి లో చక్రం తిప్పారు.. చంద్రబాబు కు అత్యంత నమ్మదగ్గ వ్యక్తి గా టీడీపీ హయంలో ఆయన అక్రమాలు చేశారని పలు ఆరోపణలు వచ్చాయి.. అయితే ప్రభుత్వం తమదే కావడంతో ఈజీ గా తప్పించుకున్నారు. కానీ ఈ వ్యవహారంలో సుజన తప్పించుకోలేరనే వాదన ఇప్పుడ గట్టిగ విన్పిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సామాన్య కార్మికుల వైద్యంలో కూడా భారీగా అక్రమాలకు పాల్పడిన వారి నుంచి నగదు సుజనాకి చేరడంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతున్నట్టుగానే భావించాలి. మరి సుజనా దీనికి ఏం సమాధానం ఇస్తాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -